ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. మహ్మద్ హారిస్ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (29), ఫకార్ జమాన్ (23) మినహా అందరూ విఫలమయ్యారు. ఓపెనర్ సైమ్ అయూబ్డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ అఘా కూడా సున్నా పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరు తాము ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరారు.
Also Read: Shoaib Malik: అభిషేక్ శర్మ సెన్సేషనల్ బ్యాటింగ్.. పీసీబీపై షోయబ్ మాలిక్ ఫైర్!
పాక్ బ్యాటరల్లో హసన్ నవాజ్ (9), ఫహీం అష్రఫ్ (8) మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. పేసర్ షహీన్ అఫ్రిది (2) నాటౌట్‌గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, అమీర్ కలీం తలో మూడు వికెట్స్ పడగొట్టగా.. మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశాడు. మహ్మద్ హారిస్, హసన్ నవాజ్ స్లోగా బ్యాటింగ్ చేయడంతో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ప్రస్తుతం ఒమన్ ఛేజింగ్ చేస్తోంది. రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 7 రన్స్ చేసింది. కెప్టెన్ జతీందర్ సింగ్ డకౌట్ అయ్యాడు. అమీర్ కలీం, హమ్మద్ మీర్జా క్రీజులో ఉన్నారు. మోస్తరు స్కోర్ కాబట్టి.. ఓ పెద్ద భాగస్వామ్యం నమోదైతే ఒమన్ గెలిచే అవకాశాలు ఉంటాయి.
End of Pakistan Inning 160-7 vs Oman.🤯🤯 pic.twitter.com/bfbxANehiA
— Moazam Chaudhary (@Moazamch98) September 12, 2025