పాకిస్థాన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చైల్డ్ టీవీ స్టార్ ఉమర్ షా (15) హఠాన్మరణం చెందాడు. 15 ఏళ్లకే నిండు నూరేళ్ల నిండిపోయాయి. తన సోదరుడు ఉమర్ షా గుండెపోటుతో చనిపోయినట్లుగా సోదరుడు, టిక్‌టాక్ స్టార్ అహ్మద్ షా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. అటు సోషల్ మీడియాలో.. ఇటు టీవీలో మంచి పేరు సంపాదిస్తున్న సమయంలో అర్థాంతరంగా ఉమర్ షా తనువు చాలించడంతో ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.
ఇది కూడా చదవండి: Tragedy: ఎంత ప్రేమో.. అన్నయ్య మరణం తట్టుకోలేక చెల్లి కూడా..
సోమవారం తన స్వస్థలం డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ఉమర్ షా చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గుండెపోటుతో చనిపోయినట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యులు, వైద్య నివేదికల ప్రకారం.. ఉమర్ షా తీవ్ర స్థాయిలో వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లోకి ద్రవం చేరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రాణాలు వదిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ప్రియుడి ముందు యువతిపై గ్యాంగ్‌రేప్
చెల్లెలు మృతి..
2023, నవంబర్‌లో ఉమర్ షా చెల్లెలు ఆయేషా హఠాత్తుగా చనిపోయింది. మళ్లీ కొద్ది రోజులకే ఉమర్ షా కూడా చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తన కుటుంబం కోసం ప్రార్థించాలని సోదరుడు అహ్మద్ షా అభిమానులను కోరాడు.

ఉమర్ షా సోషల్ మీడియాలోనూ.. టీవీల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన అన్నయ్యతో కలిసి ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవాడు. ‘‘జీతో పాకిస్థాన్’’, ‘‘షాన్-ఎం-రంజాన్’’ వంటి ప్రసిద్ధ షోల్లో పాపులర్ సంపాదించడంతో ప్రతి ఒక్కరికి సుపరిచితులయ్యారు. అన్నదమ్ములిద్దరూ చక్కటి దుస్తులు ధరించి అమాయక హాస్యం పండిస్తుంటారు. ‘‘పీచే టౌ దేఖో’’ రీల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఉమర్ షా మరణంపై ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ నివాళులర్పించారు.