దాయాది దేశమైన పాకిస్తాన్ నూతన బిల్లును సిద్ధం చేసింది. సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించనుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని మార్చాలని ప్రతిపాదించిన బిల్లును సిద్ధం చేసింది.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పతనం అంచుకు చేరుకుంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు లభించడం లేదు. పిండి, వంటనూనెలు, నెయ్యి, వంట గ్యాస్, కరెంట్ ఇలా అన్నింటా కొరతే. ద్రవ్యోల్భణం ఆల్ టైం హైకి చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అయితే అక్కడి నాయకులు మాత్రం ఆర్థిక సంక్షోభానికి వింతవింత పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి పాకిస్తాన్ ను ఇస్లాం పేరుమీద అల్లా సృష్టించాడని..ప్రజలను కూడా…
వికీపీడియా వెబ్సైట్ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన లేదా దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతో పాకిస్తాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది.
Viral Video: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి బాధ ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. లైవ్ టీవీ షోలో ఏడుస్తూ కనిపించాడు.
Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్…
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పై రోజుకో పిడుగు పడుతోంది. ఇప్పటికే అక్కడ గోధుమ సంక్షోభం నెలకొంది. ప్రజలకు నిత్యాసరం అయిన పిండి అందుబాటులో లేదు. తాజాగా మరో సంక్షోభం కూడా రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అక్కడి వ్యాపారులు. రానున్న రోజుల్లో దేశంలో నెయ్యి, వంటనూనెల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు నిత్యావసరాల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లను విడుదల చేయకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
Pakistan : ముజాహిదీన్లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐకమత్యం కీలకమని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.