Pakistan: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. పాక్‌లో రోగులు అవసరమైన మందుల కోసం కష్టపడుతున్నారు. దేశంలో ఫారెక్స్ నిల్వలు లేకపోవడం వల్ల అవసరమైన మందులు లేదా దేశీయ ఉత్పత్తిలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (API) దిగుమతి చేసుకునే పాకిస్థాన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. దీంతో ఆస్పత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతుండడంతో స్థానిక ఔషధ తయారీదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. ఆపరేషన్ థియేటర్లలో గుండె, క్యాన్సర్, కిడ్నీలతో సహా సున్నితమైన శస్త్రచికిత్సలకు అవసరమైన మత్తుమందులు రెండు వారాల కంటే తక్కువ రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్‌లోని ఆసుపత్రులలో ఉద్యోగాలను కోల్పోయేలా చేయనుంది. ప్రజల కష్టాలను మరింత పెంచుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ దిగుమతుల కోసం కొత్త లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)లను జారీ చేయడం లేదని పేర్కొంటూ ఔషధ తయారీదారులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సంక్షోభానికి ఆర్థిక వ్యవస్థను నిందించారు. భారత్, చైనాతో పాటు ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే ముడిపదార్థాలపై పాకిస్థాన్‌లో 95 శాతం ఔషధాల తయారీ ముడిపడి ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ల కొరత కారణంగా చాలా వరకు ఔషధ తయారీదారులకు దిగుమతి చేసుకున్న పదార్థాలు కరాచీ నౌకాశ్రయంలో నిలిచిపోయాయి.
Read Also: Boat Accident: ఇటలీ తీరంలో విషాదం.. శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి
పెరుగుతున్న ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు, పాకిస్తాన్ రూపాయి క్షీణత కారణంగా ఔషధాల తయారీ ఖర్చు నిరంతరం పెరుగుతోందని ఔషధ తయారీ పరిశ్రమ పేర్కొంది. ఇటీవల, పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ (PMA) పరిస్థితి విపత్తుగా మారకుండా నిరోధించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. అయినప్పటికీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టకుండా కొరత ఎంత ఉందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.కీలకమైన మందుల కొరతను గుర్తించేందుకు ప్రభుత్వ సర్వే బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేశాయని పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని డ్రగ్ రిటైలర్లు తెలిపారు. ముఖ్యమైన ఔషధాల కొరత మెజారిటీ కస్టమర్లను ప్రభావితం చేస్తోందని రిటైలర్లు వెల్లడించారు. ఈ మందులలో పనాడోల్, ఇన్సులిన్, బ్రూఫెన్, డిస్ప్రిన్, కాల్పోల్, టెగ్రల్, నిమెసులైడ్, హెపామెర్జ్, బస్కోపాన్, రివోట్రిల్ మొదలైనవి ఉన్నాయి. నవరిలో, పాకిస్తాన్ ఫార్మాస్యూటికల్ తయారీదారుల సంఘం (పిపిఎంఎ) సెంట్రల్ చైర్మన్ సయ్యద్ ఫరూక్ బుఖారీ మాట్లాడుతూ.. ప్రస్తుతం 20-25 శాతం ఔషధ ఉత్పత్తి మందగించిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.