India-Pakistan: గోవాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను భారత్ ఆహ్వానించనుంది. అంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు కూడా భారత్ ఆహ్వానం పలికింది. వీరిద్దరిలో ఎవరు హాజరైనా.. 2011 తర్వాత భారత్ ను సందర్శించిన పాక్ ప్రతినిధులుగా చరిత్రకెక్కుతారు. వీరితో పాటు చైనా విదేశాంగ శాఖ మంత్రి క్విన్ గ్యాంగ్ కు కూడా భారత్ ఆహ్వానం పలికింది. అయితే వీరిద్దరు సమావేశానికి హాజరావుతారా..? లేదా..?…
Pakistan hit by petrol shortage: ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ ను వరసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటే ఆ దేశం అప్పుల కోసం అరబ్ దేశాలతో పాటు ఐఎంఎఫ్ ను సంప్రదిస్తోంది. విదేశీమారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు పాకిస్తాన్ ను విద్యుత్ సంక్షోభం కలవరపెడితే.. తాజాగా పెట్రోల్ సంక్షోభం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ లోని పలు ప్రావిన్సులను…
SCO Summit: ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను భారత్ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్మానించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంతో ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఎస్సీఓ విదేశాంగ మంత్రులు, ఆయా దేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశం మే మొదటి వారంలో గోవా వేదికగా జరగనుంది.…
Ex US Secretary Of State On India-Pak Nuke Threat After Balakot: బాలాకోట్ దాడుల అనంతర పాకిస్తాన్, భారత్ పై అణుదాడికి సిద్ధం అయిందని వెల్లడించారు అమెరికా మాజీ విదేశాంగమంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా నాలో చెప్పారని.. ఆ సమయంలో నేను వియత్నాంలోని హనోయ్ లో ఉన్నానని.. అణుదాడికి ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం అవుతుందనే మాటతోనే నేను నిద్ర లేచానని వెల్లడించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాకిస్థాన్‌లో మరోసారి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Pakistan: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ పదవి బాధ్యతల నుంచి…
Pakistan Witnesses Major Power Breakdown: దాయాది దేశం పాకిస్తాన్ లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదు. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, కరాచీ నగరాల్లో అంధకారం అలుముకుంది. ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉదయం 7.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాకిస్తాన్ జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ ట్వీట్…
Bengaluru: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన టీనేజ్ యువతి బెంగళూర్ లో పట్టుబడింది. 19 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన యువతిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జీవని అనే యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Imran Khan: పాకిస్తాన్ దివాళా అంచుకు చేరుకుంది. ఇక అధికార ప్రకటన తరువాయిగా ఉంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు తెగ కష్టపడుతోంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ అప్పు కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చైర్మ ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రపంచం అంతా చిప్ప పట్టుకుని అప్పుకోసం తిరుగుతున్నాడని
Married Hindu girl abducted in Pakistan, raped: పాకిస్తాన్ లో మైానారిటీలు అయిన హిందువులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా హిందూ జనాభా అధికంగా ఉండే సింధ్ ప్రాంతంలోని థార్, ఉమర్కోట్, మీర్పుర్ఖాస్, ఘోట్కీ మరియు ఖైర్పూర్ ప్రాంతాలలో హిందూ యువతులు, బాలిక అపహరణ కొనసాగుతూనే ఉంది. హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎదిరిస్తే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.