Asia Cup 2025: పాకిస్థాన్ కెప్టెన్‌కు ఎంత బలుపు.. వీడియో వైరల్! ఎక్కడో కాలినట్టుంది సీనా
- ఆసియా కప్ 2025 ఫైనల్లో ఓడిన పాకిస్థాన్
- ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా
- రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్), శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఛేదించింది.
మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ నిరాకరించారు. దాంతో ఫైనల్ వేడుక కార్యక్రమం గంటన్నర లేటుగా ఆరంభం అయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం అనంతరం పాకిస్థాన్ టీమ్ రన్నరప్ ట్రోఫీని తీసుకుంది. ఆపై పాక్ ఆటగాళ్లకు కూడా ఒక్కొక్కరుగా అవార్డు అందుకున్నారు. చివరగా సల్మాన్ ఆఘా అవార్డును అందుకున్నాడు. ఆపై రన్నరప్ చెక్‌ను పాక్ అధికారులు అతడికి అందజేశారు. ఆ చెక్‌ను సల్మాన్ ఆఘా అక్కడే విసిరేశాడు. స్టేజ్‌పై పాక్ కెప్టెన్ తీరు చూసి స్పాన్సర్లు, అతిథులు షాక్‌కు గురయ్యారు.
Also Read
Also Read: Asia Cup 2025: మ్యాచ్ అనంతరం హైడ్రామా.. ట్రోఫీని తీసుకోని భారత్! సంబరాలు మాత్రం హైలెట్
పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా చెక్‌ను విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘పాకిస్థాన్ కెప్టెన్‌కు ఎంత బలుపు’, ‘ఎక్కడో కాలినట్టుంది సీనా’ అంటూ ఇండియన్ ఫాన్స్ కామెంట్స్ పెట్టారు. ఆసియా కప్ 2025లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పక్షం రోజుల్లో మూడుసార్లు పాకిస్థాన్ పనిపట్టింది. ఫైనల్ విజయంతో ఆసియా కప్‌ను సగర్వంగా తొమ్మిదోసారి కైవసం చేసుకుంది.
Negative cheers to #pakistancricketteam #BOO
Disrespect shown by Pakistan caption salman agha throwing runner up cheque in front of all on stage @GovtofPakistan @TheRealPCB #INDvPAK pic.twitter.com/wsnRawFFFd— Abhay Jamdade (@iamarj555) September 28, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!