Pakistan: పాకిస్తాన్ లో హిమపాతం విరుచుకుపడింది. పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ హిమాలయ పర్వాతాల్లో ఈ ఘటన సంభవించింది. శనివారం హిమపాతం కారణంగా 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ముగ్గురు మహిళలతో సహా 10 మంది మరణించారు. అయితే గాయపడిన వారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉంది.
Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి.
Imran Khan: అవినీతి ఆరోపణలతో ఈ నెల మొదట్లో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొకైన్ డ్రగ్ వాడినట్లు వెల్లడైంది. పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదుగురు వైద్యుల ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Imran Khan: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచుకు చేరిన పాకిస్తాన్ పరిస్థితి, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
Giriraj Singh: ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ ‘భజరంగ్ దళ్’ని కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మదానీ సమర్థించారు. ఇది 70 ఏళ్ల…
G20 Meeting: జమ్మూ కాశ్మీర్ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా. మరోసారి భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. పర్యాటక రంగంపై జీ 20 వర్కింగ్ గ్రూప్ మూడో సదస్సు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్వహించాడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజలు పాటు సభ్యదేశాలతో సమావేశం జరుగనుంది.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 30-40 మంది వరకు టెర్రరిస్టులు ఉన్నట్లు పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు ఆరోపించారు. వారందరిని అప్పగించాలని ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇటీవల మీడియా ప్రతినిధులను తన ఇంటికి రమ్మని అంతా చూపించారు. పని మనుషులు తప్పితే ఎవరూ లేరని, తనపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు.