టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురింపించాడు. ఈ కీలక మ్యాచ్ లో ద్రివిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Pakistan: పాకిస్థాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దాని నుంచి కోలుకునేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది.
Pakistan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న దాయాది దేశం, ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ ప్యాకేజీ కోసం గత కొంత కాలంగా ప్రయత్నిస్తుంది.
S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
పాకిస్థాన్ యంగ్ పేసర్ నసీమ్ షా తన మూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్ లో అంతర్జాతీయ కెరీర్ ను నసీమ్ షా ప్రారంభించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా అయ్యాడు.
Pakistan: పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ సమయంలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు 38 శాతానికి పైగా చేరుకుంది. పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, అది విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోలేకపోతుంది
దాయాది దేశమైన పాక్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ మొత్తం అప్పులు ఏడాది ప్రాతిపదికన 34.1 శాతం పెరిగి ఏప్రిల్ చివరి నాటికి రూ. 58.6 ట్రిలియన్లకు చేరుకున్నాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది.
Pakistan : ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక, రాజకీయ గందరగోళం ఏర్పడింది. దాని కారణంగా ఈ దేశం దివాళా అంచున ఉంది. పాకిస్థాన్ పరిస్థితి గురించి ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు. అదే సమయంలో ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గేందుకు పాకిస్థాన్ కూడా సిద్ధంగా లేదు.
Pakistan:ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో పాకిస్తాన్ సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు అధిక ధరలు, కొందాం అనుకున్నా నిత్యవసరాలు అందుబాటులో ఉండటం లేదు. దీనికి తోడు కరెంట్, ఇంధన సమస్యలతో పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవాల్ చేస్తున్నారు.