భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్థాన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు, పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ప్రకారం ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం…
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్ మిలిటరీ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, పెషావర్ నగరాల్లో ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఆర్మీ కంటోన్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేశారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అక్రమం అని నిన్న పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ)ని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడిని చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా ఆహారం, ఇంజెక్షన్ ఇచ్చారని ఇమ్రాన్ తరఫున వాదించే లాయర్లు పేర్కొన్నారు.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.