PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.
వీరిద్దరు నేపాల్ లో పెళ్లి చేసుకున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను జైలులో ఉంచగా, ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేశారు. అయితే తాజాగా వీరిద్దరికి శనివారం బెయిల్ లభించడంతో రిలీజ్ అయ్యారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు.
Read Also: Honey Trap: పాకిస్తాన్ వలుపు వలలో బీఎస్ఎఫ్ ఉద్యోగి..
తాజాగా ఓ నేషనల్ మీడియాతో సీమా హైదర్ మాట్లాడుతూ.. నా భర్త హిందువు, భారతీయుడు కాబట్టి ఇప్పుడు నేను కూడా హిందువు, భారతీయురాలినే అని ఆమె చెప్పింది. 30 ఏళ్ల సీమాకు ఏడేళ్ల లోపు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నారు. సచిన్ వయసు 25 ఏళ్లు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయం అయిన వీరిద్దరు మార్చి నేలలో నేపాల్ లో వివాహం చేసుకున్నారు.

తన ప్రయాణం గురించి మాట్లాడిన సీమా హైదర్.. నేను చాలా భయపడ్డానని, కరాచీ నుంచి దుబాయ్ వెళ్లానని, అక్కడ 11 గంటలు వేచి ఉందీ.. నేపాల్ చేరామని, పొఖారాలో సచిన్ ను కలిసినట్లు చెప్పింది. ఆ తరువాత సీమా పాకిస్తాన్ వెళ్లగా, సచిన్ ఇండియా తిరిగి వచ్చాడు. అయితే ఆ తరువాత భర్తతో విభేదాలు రావడంతో తనకున్న ప్లాన్ ని రూ.12 లక్షలకు అమ్ముకుని మళ్లీ తన నలుగురు పిల్లలతో నేపాల్ వచ్చింది. కొంత కాలం పొఖారాలో ఉండీ మే 13 ఖాట్మాండు నుంచి ఢిల్లీకి బస్సులో వచ్చింది, ఆమెకు సచిన్ గ్రేటర్ నోయిడాలో వసతి ఏర్పాటు చేశాడు.
అధికారులకు విషయం తెలియడంతో జూలై 4న వారిని అరెస్ట్ చేశారు. సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినట్లు అభియోగాలు మోపగా, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమె అధికారికంగా భారత్ లో ఉండేందుకు పత్రాలపై దృష్టిపెట్టింది. మరోవైపు సీమా భర్త గులాం హైదర్ తన భార్యను తిరిగి కలవడానికి భారత ప్రభుత్వ సాయాన్ని కోరాడు. అయితే తనకు పాక్ వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళ్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపింది.