Espionage Charge: గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు. నవీన్ పాల్‌పై ఎఫ్‌ఐఆర్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ పత్రాలు, జీ-20 సమావేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒక వ్యక్తికి అందించినట్లు పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా సమాచారాన్ని లీక్ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.
Also Read: Chile New Virus: చిలీలో కొత్త వైరస్… ఇబ్బందులు పడుతున్న జనం
విచారణలో నవీన్ పాల్ సోషల్ మీడియా ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడని తేలింది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. తొలుత ఆ మహిళ నంబర్ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినదిగా గుర్తించారు. అయితే ఆ నంబర్ ఐపీ అడ్రస్‌ను గుర్తించగా అది కరాచీకి చెందినదని తేలింది. నవీన్ మొబైల్ ఫోన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ, జీ20కి సంబంధించిన పలు పత్రాలు కూడా పోలీసులకు లభించాయి. ‘సీక్రెట్స్’ పేరుతో ఫైళ్లను భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఒక మహిళ కోసం కూడా వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కొంత మొత్తాన్ని నవీన్ ఖాతాకు డిజిటల్‌గా బదిలీ చేసింది.