PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు.
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య టెస్ట్ మ్యాచ్లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీని సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
మే 9 హింసాకాండ తర్వాత పాకిస్తాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగిన తరువాత బహిష్కరించబడిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొత్తం పార్టీ రిక్షాలో సరిపోతుందని అధికార పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ అన్నారు.
IndiGo: అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది.
Pakistan Rains: పొరుగుదేశం పాకిస్తాన్లో శనివారం కుండపోత వర్షాల కారణంగా 25 మంది మరణించగా, 145 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.