India record biggest victory vs Pakistan in ODI Cricket: ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో భారత్ సూపర్ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా పేసర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో.. 8 వికెట్లకే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ముగించింది. 27…
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది.
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక…
Pakistan: పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది.
ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో నేడు ( ఆదివారం ) జరిగే సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ నెల 2న భారత్, పాక్ తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. దీంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ్టి మ్యాచ్ కు ‘రిజర్వ్ డే’ను ప్రకటించారు.
2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచినట్లు పోస్ట్ చేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక క్రికెట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి డిమాండ్‌ను అంగీకరించడానికి మీపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందని వెంకటేష్ ప్రసాద్ సమాధానంలో రాశారు.
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది.
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి.…