India At UN: దాయాది పాకిస్తాన్ ప్రధాని అన్వరుల్ కాకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌పై ఆరోపణలు చేశారు. మరోసారి పాకిస్తాన్ యూఎన్ లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి ప్రతిగా భారత్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాలని, ఉగ్రవాదాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
భారత్ కి వ్యతిరేఖంగా నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారాలను పాకిస్తాన్ అలవాటుగా చేస్తోందని యూఎన్ లో భారత సెక్రటరీ పటేల్ గెహ్లాట్ విమర్శించారు. అంతర్జాతీయ దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్ ఇలా చేస్తుందని భారత్ ఘాటుగా విమర్శించింది. పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘననుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తుందని చెప్పింది.
Read Also: Mynampally: మల్కాజ్‌గిరి టికెట్ నాకొద్దు.. పార్టీకే రాజీనామా చేస్తున్న.. మైనం పల్లి లేఖ
భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు పూర్తిగా భారత అంతర్గత విషయమని, మా అంతర్గత వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్ కు ఎలాంటి అధికారం లేదని చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఉగ్రవాద మౌళిక సదుపాయాలను మూసేయాలని, పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని భారత్ చెప్పింది.
2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హితభోద చేసింది. మానవ హక్కుల విషయంలో ఇతర దేశాల వైపు వేలెత్తి చూపడానికి ముందు పాకిస్తాన్ తన సొంత ఇంటిని చూసుకోవాలని, 2023లో పాక్ ఫైసలాబాద్ జిల్లాలో జరన్ వాలాలో మైనారిటీ క్రైస్తవుల దాడిని భారత్ ప్రస్తావించింది.