వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ కు రావాల్సి ఉండగా.. వీసా కారణాలతో రాలేకపోయింది.
Read Also: Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్కు ఆ స్టార్ ప్లేయర్ దూరం..!
మీడియా నివేదికల ప్రకారం.. ఈ రోజు పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయబడుతుంది. ఇంతకుముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సరైన సమయానికి వీసా లభించలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అభిప్రాయాలను ఐసీసీకి అందించింది. ఈ విషయంపై ఐసీసీ జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని బీసీసీఐని కోరింది. దీంతో ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా అందితే.. ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.
Read Also: Chicken Side Effects : రోజూ చికెన్ ఎందుకు తినొద్దో తెలుసా.. వామ్మో నిజామా?
ఇక ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు మొదటగా నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. అక్టోబర్ 10న పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్‌లు తలపడనున్నాయి.