Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో గత వారం అమెరికా రాయబారి పర్యటించారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. పాకిస్తాన్ దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న డోనాల్డ్ బ్లోమ్ పీఓకేలో పర్యటించారు. గిల్గిత్ బాల్టిస్తాన్ లో యూఎస్ బృందం పర్యటించడాన్ని భారత్ తప్పుపట్టింది.
కాగా ఈ వివాదంపై భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. పాకిస్తాన్ లోని అమెరికా రాయబారి గురించి నేను స్పందించలేదు.. కానీ దీని కన్నా ముందు జీ20 సమయంలో జమ్మూ కాశ్మీర్ సందర్శించిన అమెరికా బృందంలో పర్యటించిందన్నారు. డొనాల్డ్ బ్లోమ్ ఆరు రోజులు గిల్గిత్ బాల్టిస్తాన్ లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి, అమెరికాతో సమా మూడో పక్షం ఈ సమస్యలో కలుగజేసుకోదని గార్సెట్టి అన్నారు.
Read Also: Singareni: గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగులకు రూ.700 కోట్ల ఇంసెంటివ్స్
ఇక కెనడా, ఇండియా వివాదంపై కూడా ఆయన స్పందించారు. కెనడియన్ పార్లమెంట్ లో నాజీ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంపై, ప్రతీ ఒక్కరు తప్పును గుర్తించారని భావిస్తునట్లు వెల్లడించారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై అమెరికా సమాచారం పంచుకోవడంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.