Babar Azam left Sri Lanka for Pakistan after Fires on Shaheen Afridi: పాకిస్తాన్ క్రికెట్లో పెను దుమారం రేగినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన జట్టు ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పేసర్ షహీన్ షా అఫ్రిదీతో బాబర్‌కు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. చివరకు తన టీంమేట్స్‌కు చెప్పకుండానే బాబర్ శ్రీలంక నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయాడట. ఆసియా కప్ ఫైనల్…
Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ ఎన్కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు.
Baramulla Encounter: బారాముల్లా ఎన్కౌంటర్ లో భద్రత బలగాలకు కీలక విజయం లభించింది. పీఓకే నుంచి ఇండియాలో చొరబడేందుకు ప్రయత్నించి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శనివారం బారాముల్లాలోని ఊరీ సెక్టార్ లో ఎల్ఏసీ వెంబడి ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేశాయి.
Petrol Diesel Rates in Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిరోజూ వస్తువుల ధరలను పెంచుతూనే ఉంది.
India-Pak Cricket: సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు జరగవని కేంద్రం క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాక్ చరమగీతం పాడకుంటే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించూడదని బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, చొరబాట్లు, దాడులు ఆపితే తప్ప ఇరు దేశాల మధ్య క్రికెట్ సాధ్యపడదని ఆయన రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో చెప్పారు.
వన్డే ప్రపంచకప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని టాక్.
Pakistan: దాయది దేశం పాకిస్తాన్, భారతదేశంపై ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా గ్లోబల్ పవర్ గా భారత్ ఎదుగుతుంటే.. డాలర్లను అడుక్కునే స్థాయికి పాకిస్తాన్ దిగజారింది. దీంతో భారత సరిహద్దుల్లో నిత్యం అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
Naseem Shah Likely to Miss ODI World Cup 2023: ఆసియా కప్ 2023 టైటిల్ కొడుదామనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పరాయజం ఎదురైన విషయం తెలిసిందే. సూపర్-4లో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలై.. ఇంటిబాట పట్టింది. ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు.. వన్డే ప్రపంచకప్ 2023కి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్-4లో భాగంగా…