Pakistan: పాకిస్తాన్లో బాంబు పేలుడు ధాటికి 8 మంది మరణించారు. రాకెట్ లాంచర్ మందుగుండుతో పిల్లలు ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. సింధ్ ప్రావిన్సులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన 8 మందిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా భారత్ పైనే విమర్శలు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు.
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో గత వారం అమెరికా రాయబారి పర్యటించారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. పాకిస్తాన్ దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న డోనాల్డ్ బ్లోమ్ పర్యటించారు. గిల్గిత్ బాల్టిస్తాన్ లో యూఎస్ బృందం పర్యటించడాన్ని భారత్ తప్పుపట్టింది.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు.
Pakistan: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరు ఉల్ హక్ కాకర్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
India-Canada: ఇండియా-కెనడాల మధ్య వివాదంపై పాకిస్తాన్ మీడియా పండగ చేసుకుంటోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాత్రం కెనడా, భారత్ బంధం వీక్ కావడంపై హ్యాపీగా ఫీల్ అవుతోంది.
Pakistan: రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం ఇలా పలు సమస్యలు దాయాది దేశం పాకిస్తాన్ ను పట్టిపీడిస్తున్నాయి. మరోవైపు ఆ దేశంలో పేదరికం పెరుగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక చెబుతోంది. ఏకంగా 9.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకీడుస్తున్నారు. పాకిస్తాన్ లో గతేడాది పేదరికం 34.2 శాతం ఉంటే ఈ ఏడాది 39.4 శాతానికి పెరిగింది. 1.25 కోట్ల ప్రజల రోజూ వారి ఆదాయం 3.65 డాలర్ల కన్నా తక్కువగా ఉందని వరల్డ్…
India At UN: దాయాది పాకిస్తాన్ ప్రధాని అన్వరుల్ కాకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌పై ఆరోపణలు చేశారు. మరోసారి పాకిస్తాన్ యూఎన్ లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి ప్రతిగా భారత్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాలని, ఉగ్రవాదాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
టీమిండియా జట్టు మళ్లీ వన్డేల్లతో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన గెలుపుతో టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది.