IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రేక్షకులకు పండగ. ఏం చక్కా మ్యాచ్ ను చూసేందుకు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అయితే అందరూ టీవీల్లో చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ కారణం వల్ల ఆఫీసుల్లో ఉన్నవారు గానీ, టీవీలు లేని వారు గానీ ఫోన్లను వాడుతుంటారు. అయితే ఈ వరల్డ్ కప్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా వస్తున్న విషయం తెలిసిందే. ఇంకేముంది అటు పని చేసుకుంటూ, ముందు ఫోన్ ఆన్ చేసి అందులో హాట్ స్టార్ ఓపెన్ చేయడమే.
Read Also: Heat Wave: ప్రమాదం ముంగిట భారత్, పాక్ 220 కోట్ల మంది.. ఘోరమైన వేడితో ముప్పు..
అయితే ఇప్పుడు హాట్ స్టార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామనుకుంటున్నారా.. ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఉచితంగా చూడడానికి అవకాశం కల్పించడంతో రికార్డు వ్యూస్ వస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 86 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Read Also: T.Congress: రేపు 58 పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా.. మరో రెండ్రోజుల్లో మిగిలిన పేర్లు