IND vs PAK: వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(86), శ్రేయాస్ అయ్యర్(53) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించింది. మొదటగా బౌలింగ్ తీసుకున్న భారత్ బౌలర్లలో అత్యుత్తమ ప్రదర్శన చూపించి పాకిస్తాన్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
Read Also: Super Visa: కెనడాలో ఉంటున్న వారికి గుడ్ న్యూస్.. తల్లిదండ్రులతో నివాసం ఇక సులువు..
మరోవైపు బ్యాటింగ్ లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి నుంచి దూకుడుగానే ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంతో సులువైన లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ 86, గిల్ 16, విరాట్ కోహ్లీ 16, శ్రేయాస్ అయ్యర్ 53, కేఎల్ రాహుల్ 19 పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 2, హసన్ అలీ ఒక వికెట్ తీశాడు.
Read Also: Revanth Reddy: రెండు నెలలు ఓపిక పట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ భరోసా
ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ పై ఇది భారత్ కు 8వ విజయం. ఏ వరల్డ్ కప్ లో ఇరు జట్లు తలపడినా భారత్ దే పైచేయిగా వస్తోంది. ఆ ఆనవాయతీని రోహిత్ సేన కూడా కొనసాగించింది. ఇక, ఈ వరల్డ్ కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ ను అక్టోబరు 19న బంగ్లాదేశ్ తో ఆడనుంది.