Hafiz Saeed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ హత్యకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27న కమాలుద్దీన్ సయూద్ని గుర్తు తెలియని వ్యక్తుల పెషావర్ నుంచి కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అతన్ని హత్య చేశారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్కు చేరుకుంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఇదే కాకుండా ఆ దేశంలో రాజకీయ అస్థిరత దేశ పరిస్థితులను మరింతగా దిగజారుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దైంది. తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్…
Hyderabad Pacer Nishanth Saranu impresses Pakistan Cricket Team during net Session: వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే వార్మప్ మ్యాచ్లు మాత్రం నేటి నుంచే (సెప్టెంబరు 29) ఆరంభం కానున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈరోజు హైదరాబాద్లో…
హైదరాబాద్లో ఉన్న పాక్ జట్టు పూర్తి ఫుడ్ మెనూను వెల్లడించింది. ఇందులో చికెన్, మటన్ నుంచి గ్రిల్డ్ ఫిష్ వరకు అన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల ఆహారంలో ప్రోటీన్ ఉంచడం, గ్రిల్డ్ లాంబ్ చాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్లను చేర్చారు. అంతేకాకుండా ప్రోటీన్ల కోసం చికెన్, మటన్, చేపలు అడిగారట. ఇదేకాకుండా.. కార్బోహైడ్రేట్ల కోసం ఉడికించిన బాస్మతి బియ్యం, స్పఘెట్టి బోలోగ్నీస్ సాస్, వెజిటేరియన్ పులావ్ వండమని చెఫ్ కు చెప్పారు.
Hafiz Saeed: దాయాది దేశం పాకిస్తాన్ లో ఏదో జరుగుతోంది వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. దీంతో అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. రెండుమూడు రోజుల క్రితం జియావుర్ రెహ్మన్ అనే హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాదిన కరాచీలో హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి ఆయన్ని హతమార్చారు. కాశ్మీర్ లో హిజ్బుల్ తరుపున ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసే పనిని ఈ ఉగ్రవాది చేసేవాడు.
Pakistan: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న దాయాది దేశం దక్షిణాసియాతో పాటు యూరప్ దేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసింది. చివరకు తన ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి చైనాకు గాడిదనలు ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆ దేశం బిచ్చగాళ్లు, దొంగలను కూడా ఎగుమతి చేస్తోంది. మీరు వింటుంది నిజమే పరాయి దేశాలకు వెళ్లిన పాకిస్తానీయులు దొంగలు, బిచ్చగాళ్లుగా మారుతున్నారు.