IND vs PAK: వన్డే ప్రపంచకప్ లో భాగంగా.. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హైఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుని.. పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. అయితే భారత్ బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ బ్యాటర్లు చెతులేత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 191 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజాం(50), రిజ్వాన్(46) రాణించడంతో ఈ మాత్రం పరుగులు చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 20, ఇమామ్-ఉల్-హక్ 36 పరుగులు చేశారు.
ఇక మొదటి నుంచి దూకుడు ప్రదర్శన చూపించిన భారత్ బౌలర్లలో బుమ్రా, సిరాజ్, హార్థిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. అయితే 192 పరుగుల లక్ష్యంతో కాసేపట్లో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లుగా శుభ్ మాన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు.
Read Also: Hyderabad: బస్సుకు బ్రేకులు ఫెయిల్.. తప్పిన ప్రమాదం