World Cup 2023: ప్రపంచ కప్ 2023లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 345 భారీ టార్గెట్‌ని సునాయసంగా ఛేదించింది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ తో పాటు అబ్దుల్లా షఫీక్ సెంచరీలతో చెలరేగి పాక్ విజయంలో కీలకంగా మారారు. రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేశాడు.
Himanta Biswa Sarma: పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానంపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటన పాకిస్తాన్, తాలిబాన్ ప్రకటనల్ని పోలి ఉందని ఆరోపించారు.
2016 Pathankot attack handler Shahid Latif Dies in Pakistan: 2016 పఠాన్‌కోట్ దాడి ప్రధాన సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ (41) మృతి చెందాడు. మంగళవారం పాకిస్థాన్‌లోని సియాల్కోట్లోని మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. లతీఫ్ సమాచారం గురించి తెలిసిన షూటర్లు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. స్థానిక, స్వదేశీ ఉగ్రవాదులు ఈ హత్యలో పాల్గొన్నారని సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పలువురు…
Pakistan record the highest chase in ICC ODI World Cup: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాక్ నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ ఈ రికార్డు (Pakistan Record Chase) ఖాతాలో వేసుకుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఇప్పుడు అత్యధిక ఛేజింగ్.…
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
China: ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్థాన్ జట్టు.. 2023 ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించింది. నెదర్లాండ్స్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. అయినప్పటికీ పాకిస్తాన్ గెలవడానికి చెమటోడ్చవలసి వచ్చింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, భద్రత కారణంగా కొత్త బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను చైనా తిరస్కరించింది.