వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తుగా ఓడించింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గాన్ చేతిలో పాక్ ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఓటమిని పాకిస్తాన్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ టీమ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: Vemulawada: భక్తులు అలర్ట్.. వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. ఎందుకంటే..?
అయితే, అంతకు ముందు టీమిండియా చేతిలో కూడా పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. తమ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేయాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చాక పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది అని పలు రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఇక, బాబర్ స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనెజ్‌మెంట్ కమిటీ పరిశీలిస్తుంది అని సమాచారం.
Read Also: Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్‌లోకి..!
ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాక్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు ముందే పాకిస్తాన్ టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. కాగా, మెగా టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదనపిస్తున్న బాబర్ ఆజం.. కెప్టెన్సీ పరంగా మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ జస్ట్ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.