డేవిడ్ భాయ్ బ్యాటింగ్‌లో ఇరగదీస్తాడన్న విషయం అందరికి తెలుసు. కానీ బౌలింగ్ కూడా చేస్తాడన్నది ఎవ్వరికి తెలియదు. అతని బౌలింగ్ చూస్తే.. అచ్చం రెగ్యూలర్ బౌలర్ లానే కనపడ్డాడు. ప్రస్తుతం వార్నర్ బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌పై పాకిస్థాన్ ఇప్పుడు ఎదురుదాడికి తెరతీసింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నవంబర్ 1లోగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు దాటిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తూర్పు లడఖ్‌లోని సరిహద్దు రేఖ వద్ద చైనాతో సైనిక ప్రతిష్టంభన ముగిసి, చైనా దళాలు వెనక్కి తగ్గే వరకు భారత వైమానిక దళం వెనక్కి తగ్గదని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భారత వైమానిక దళం కార్యాచరణ సన్నాహాలు పూర్తిగా వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా డైనమిక్‌గా కూడా ఉన్నాయని అన్నారు.
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Pakistan: విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు ఈ విషయంలో పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.
Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్‌తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా…
న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లో ఓటమి చెందిన తర్వాత పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జట్టు ఓటమిపై పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Pakistan: పాకిస్తాన్లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
Hafiz Saeed: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు కమాలుద్దీన్ హత్యకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 27న కమాలుద్దీన్ సయూద్ని గుర్తు తెలియని వ్యక్తుల పెషావర్ నుంచి కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అతన్ని హత్య చేశారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.