ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెత్త రికార్డును నెలకొల్పారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 90 పరుగులు సమర్పించుకున్నాడు.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
ఇదిలా ఉంటే.. అతని 10 ఓవర్లు మొత్తం బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా.. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు తన సహచర పేసర్ హసన్ అలీ పేరిట ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉంటే.. మరో బౌలర్ హ్యారీస్ రవూఫ్ కూడా చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో రవూఫ్ కూడా హసన్ అలీని దాటేశాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో అఫ్రిది తర్వాత రవూఫ్ ఉన్నాడు. అంతేకాకుండా.. ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో గరిష్టంగా 16 సిక్సర్లు ఇచ్చిన చెత్త రికార్డు కూడా హారిస్ రౌఫ్ పేరిట నమోదైంది.
Read Also: Anurag Thakur: కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకున్నాడు.. కానీ, కవిత వార్తల్లో నిలిచింది
0/90 – షాహీన్ అఫ్రిది vs న్యూజిలాండ్, బెంగళూరు, ఈరోజు*
1/85 – హారిస్ రవూఫ్ vs న్యూజిలాండ్, బెంగళూరు, ఈరోజు*
1/84 – హసన్ అలీ vs ఇండియా, మాంచెస్టర్, 2019
3/83 – హారిస్ రవూఫ్ vs ఆస్ట్రేలియా, బెంగళూరు, 2023