న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి తగిలింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఒకవేళ ఇలానే వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. డీఎల్ఎస్ ప్రకారం చూసుకుంటే.. పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువ సాధించింది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు చెత్త రికార్డును నెలకొల్పారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు పాకిస్తాన్‌పై వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్‌లో రెండో అత్యధిక స్కోరు ఇదే. కివీస్ బ్యాటింగ్‌లో ఓపెనర్ల మంచిగా రాణించారు. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్వాలి వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. తెల్లవారుజామున 9 మంది సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. పాకిస్తాన్ వ్యాప్తంగా అంతకుముందు రోజు జరిగిన టెర్రర్ అటాక్స్‌లో 17 మంది మరణించిన, తర్వాత రోజే ఈ దాడి జరిగింది.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లోని మియాన్వాలి ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి.
Pakistan: పాకిస్థాన్‌లోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్‌వాలిలోని పాకిస్థాన్ వైమానిక దళ స్థావరంలోకి ఆత్మాహుతి బాంబర్లతో సహా ఐదారుగురు మంది భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు ప్రవేశించారు.
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.
Honour Killing: ‘పరువు’ పేరుతో పాకిస్తాన్ దేశంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. మానవహక్కుల నివేదిక ప్రకారం, పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రతీ ఏడాది 1000 మంది మహిళలు దారుణంగా హత్యలకు గురవుతున్నారు. మరోసారి మరో పరువు హత్య పాకిస్తాన్లో చర్చనీయాంశం అయింది. జంటకు హాని కలిగించొద్దని న్యాయమూర్తి హెచ్చరించినప్పటికీ అమ్మాయి కుటుంబీకులు అబ్బాయిని, అమ్మాయిని చంపేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే ఈ హత్యలకు కారణమైంది.
Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్‌లైన్‌గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
Opener Fakhar Zaman React on Pakistan Defeat vs India: వన్డే ప్రపంచకప్ 2023లో అన్నింటికంటే భారత్ చేతిలో పరాజయమే తమ జట్టును తీవ్రంగా బాధించిందని పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ తెలిపాడు. భారత్ పిచ్‌లపై పరుగులు చేయాలంటే ముందుగా 4-5 ఓవర్లు క్రీజ్‌లో ఉండిపోవాలని, ఆ తర్వాత సులువుగా పరుగులు చేయొచ్చన్నాడు. తన గాయం పెద్దదేమీ కాదని, కానీ ముందుజాగ్రత్తగా మేనేజ్మెంట్ బెంచ్‌కే పరిమితం చేసిందని ఫకర్ జమాన్ స్పష్టం చేశాడు. మంగళవారం కోల్‌కతా…