Pakistan: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు పాస్‌పోర్టులు కూడా ప్రింట్ చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Sowa Fish: పాకిస్తాన్‌కి చెందిన ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని వలలో చిక్కిన ఓ చేప అతని తలరాతనే మార్చేసింది. కరాచీ నగరంలోని నిరుపేద మత్స్యకారుడైన హాజీ బలోచ్ అత్యంత అరుదైన చేప చిక్కింది. ఇది కోట్లలో రేటు పలకడంతో అతని దశ తిరిగింది.
Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.
వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక గెలిస్తే పాక్ కి సెమీస్ ఆశలుండేవి. కానీ, లంకను న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లయింది.
Pakistan: ఇన్నాళ్లు భారత వ్యతిరేక ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితం అని భావిస్తుండే వారు.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏ ఉగ్రవాది ఎప్పుడు ఎలా కిడ్నాప్ అవుతాడో, ఎప్పుడు ఎక్కడ చనిపోయి పడుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే పాక్ గూఢాచర సంస్థ ఐఎస్ఐకి కూడా తెలియకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని కాల్చి పడేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన వారు, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఖతం అవ్వడం పాకిస్తాన్‌కి మింగుడుపడటం లేదు. యథావిధిగా…
Irfan Pathan: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరులు సామాన్య పాలస్తీనియన్లు చనిపోతున్నారు. అంతకుముందు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని ఊచకోత కోశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా తలలు కోసి చంపేశారు. ఈ దాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.