Ayesha Omar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని అందరికీ తెలుసు. అక్కడ మహిళకు కూడా భద్రత లేదు. ఒంటరిగా మహిళలు కనపిస్తే కిడ్నాప్‌కి గురవ్వడం, అత్యాచారానికి గురవ్వడం అక్కడ సర్వసాధారణంగా మారింది. అయితే, తాజాగా ఆ దేశ ప్రముఖ నటి అయేషా ఒమర్ కూడా పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్నాన్ ఫైసల్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు.
పాకిస్తాన్‌లో మహిళలు సురక్షితంగా లేరని చెప్పారు. పాక్ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కూడా ప్రమాదకరంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన సొంత దేశంలో తాను సురక్షితంగా లేనని అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల భయాన్ని పురుషులు ఎప్పుడూ అర్థం చేసుకోవడం లేదని చెప్పారు. పాకిస్తానీ స్త్రీలు ఎలా ఎదుగుతారనే విషయాన్ని పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేదని చెప్పారు.
Read Also: Success Story : మంచి ఉద్యోగం వదిలేసి.. వ్యవసాయం చేస్తూ ఏడాదికి రూ.70 లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!
నా పొరుగింటి వంట మనిషి తనను అనుచితంగా తాకినప్పుడు వేధింపులు ఎదురయ్యాయని అయేషా చెప్పారు. స్వేచ్చ, భయం లేకుండా తిరగడం ప్రజలందరీ ప్రాథమిక హక్కు అని చెప్పారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో తాను బయట నడవగలిగానని, నాగరికమైన ప్రాంతాల్లో ఇప్పటికీ తాను సురక్షితంగా లేనని ఆమె విలపించింది. కిడ్నాప్ కానని, అత్యాచారం జరగదనే భయం లేకుండా నా దేశంలో స్వేచ్ఛగా తిరిగే సమయం ఎప్పుడు వస్తుందని ఆమె ప్రశ్నించారు. మహిళలు రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు. పార్కుకి వెళితే, కనీసం పది మంది మీ వెంట పడతారని, వారు తాకడానికి ప్రయత్నిస్తారని అయేషా పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులను వివరించారు.