Pakistan Blast: పాకిస్థాన్ లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 22 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast In Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇవాళ పోలియో టీకాలు వేసే కార్మికులకు భద్రత కల్పించేందుకు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలోని మాముంద్ తహసీల్‌లో చోటు చేసుకుంది. అయితే, ఈ పేలుడు సంభవించినప్పుడు పోలీసులు పోలియో టీకా బృందాలతో భద్రతా విధుల్లో చేరడానికి వ్యాను ఎక్కారు.. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.
Read Also: Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది
Also Read
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
కాగా, ఈ పేలుడులో ప్రమాదంలో గాయపడిన వారందరూ పోలీసులేనని పోలీసు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షద్ హుస్సేన్ దాడిని తీవ్రంగా ఖండించారు. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. పోలియో టీకాను వ్యతిరేకిస్తున్నందున పాకిస్తాన్‌లోని పోలియో బృందాలు తరచూ ఉగ్రవాదుల చేత మరణించబడుతున్నారు. ఈ దాడికి బాధ్యులని ఇప్పటి వరకు ప్రకటించలేదు.. అయితే పాకిస్తాన్ తాలిబాన్‌తో సహా ఇస్లామిక్ తీవ్రవాదులు గతంలో అనేక మంది పోలియో టీకా కార్మికులతో పాటు వారిని రక్షించే పోలీసులపై బాంబు దాడి చేసి చంపేశారు.
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!