Pakistan elections: ముంబై దాడుల సూత్రధారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు తల్హా సయీద్ ఈ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఉగ్రవాది కొడుకు ఎన్నికల్లో పోటీ చేయడం భారత్‌లో చర్చనీయాంశం అయింది. పాకిస్తాన్ నగరం లాహోర్ నుంచి పోటీ చేసిన తల్హా సయీద్ తాజా ఎన్నికల్లో ఓడిపోయాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అభ్యర్థి గెలుపొందాడు.
Read Also: Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ డిప్యూటీ పీఎం..
మాజీ ప్రధాని, పాక్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్, ఈ ఎన్నికల్లో పాక్ ఆర్మీ సాయంతో గెలుపొందడానికి ఇష్టపడమని, ఓటమిని అంగీకరించాలని పీటీఐ ఒక ప్రకటనలో కోరింది. మరోవైపు నిన్న జరిగిన ఎన్నికల తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 265 సీట్లలో ప్రస్తుతం 100 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ గెలుపొందింది. అధికారం కావాలంటే 133 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీ మెజారిటికీ దూరంగా ఉంది.
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్, హింస చెలరేగింది. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, ఫలితాలను రిగ్గింగ్ చేయడానికి ఫలితాలను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది.