Gautam Gambhir: “అది ప్లేయర్స్ ఇష్టం”.. హనుమాన్ ఆలయ వివాదంపై గంభీర్ ఫైర్.. విమర్శకులకు బిగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్పు గెలిచిన సంతోషం ఓ వైపు ఉంటే.. మరోవైపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ట్రోఫీని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కేవలం ఒకే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరానికి వెళ్లడం వివక్షాపూరితమని ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ ఫైర్ అయ్యాడు. ముందుగా టీమ్ విజయానికి విలువ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఇష్యూస్‌కు ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. 15 మంది టీమ్ ఎంతో కష్టపడి సాధించిన విజయం ఇది. ఈ విక్టరీపై అనవసర ప్రకటనలు చేయడం విజయం విలువను తగ్గిస్తాయి. సౌతాఫ్రికా జట్టుపై ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారో నాకు తెలుసు. ప్రస్తుతం గెలిచిన ఆనందంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం మన జట్టును, మన ప్లేయర్స్‌ను మనమే తక్కువగా చేసుకోవడం అవుతుంది. విక్టరీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లేయర్స్ ఇష్టం. అది వాళ్ల స్వేచ్ఛ. ఇందులో రాజయం, మతపరమైన జోక్యం అనవసరం. ఇది దేశానికి గర్వ కారణమైన సమయం. విమర్శల కంటే విజయాన్ని ఆస్వాధించడం ముఖ్యం.” అని గంభీర్ స్పష్టం చేశారు.
READ MORE: Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్‌కు మోజ్తాబా!
Also Read
ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై తాజాగా మాజీ ప్లేయర్ నుంచి విమర్శలు రాగా.. గంభీర్‌తో పాటు మాజీ ప్లేయర్ భజ్జీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
READ MORE: Flight: విమానంలో మహిళ రచ్చరచ్చ.. కిందకు దించేసిన సిబ్బంది
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?