Pakistan Elections2024: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత విక్టరీ స్పీచ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రసంగంలో ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ లండన్ ప్లాన్ ఫెయిల్ అయిందన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక, ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో.. నా ప్రియమైన పాక్ ప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు అని ఇమ్రాన్ పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 10 ఏసీ బస్సులు.. నేడు ప్రారంభించనున్న సీఎం
నేను కూడా ఓటు వేశాను.. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు.. ఈ ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల లండన్ ప్లాన్ బెడిసి కొట్టింది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: NIA Raids: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. 25 ప్రాంతాల్లో తనిఖీలు
ఇమ్రాన్ ఖాన్ కు పాక్ యువత మద్దతు..
అయితే, 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి దించేశారు. ఆయనపై అనేక అవినీతి కేసులు పెట్టారు. దీంతో 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు పంపించారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం కూడా విధించారు. అయితే, ఈ ఎన్నికల్లో పాక్ యువత మాత్రం ఇమ్రాన్‌కు మద్దతుగా నిలిచింది. పాక్‌లో సైనిక మద్దతు అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా ఉన్నారు. ఈ వాదనను పాక్ ఆర్మీ తీవ్రంగా ఖండించింది. అలాగే, రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన వచ్చిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు నిపుణులు వెల్లడించారు.