దాయాది దేశం పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రీకులతో వెళ్తున్న ట్రక్కు కాలువలో పడిపోయింది. బుధవారం జరిగిన ఈ విషాదకరం సంఘటనలో మొత్తం 17 మంది మరణించారు.
ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్‌పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు.
పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం సొంత ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్ ఆర్మీ క్రూరత్వానికి బలి అయినది మరెవరో కాదు.. సొంత దేశ పోలీసులే. పాకిస్థాన్ సైన్యం పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడ ఉంచిన పోలీసులను కొట్టి రక్తస్రావం చేసింది.
పాకిస్థాన్ అధికారం ఇస్లామాబాద్, రావల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే ఈ నగరాన్ని పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించారు.
పాకిస్థాన్‌లో రంజాన్ షాపింగ్‌లే లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారు. బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు ఘోరమైన పేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. తన మొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు. నవాజ్, ఇమ్రాన్‌ల బాటలోనే తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాను ఎంచుకున్నాడు. అయితే.. కశ్మీర్ సమస్యకు సంబంధించి సౌదీ అరేబియా షాబాజ్‌కి భారీ షాకిచ్చింది. కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్థాన్ ప్రధానికి సూచించారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు.
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల గురించి మాట్లాడుతూ.. వారు భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు.