PAK vs SL T20: జనవరి 7 నుంచి 11వ తేదీ వరకు శ్రీలంకలో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది.
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్…
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
Mohsin Naqvi: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిర్వహణను పర్యవేక్షించే ప్రధాన సంస్థ. 1909లో స్థాపితమైన ఈ సంస్థ వివిధ దేశాల క్రికెట్ బోర్డులను సమన్వయం చేస్తూ, క్రికెట్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తోంది. ప్రపంచకప్, టి20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రముఖ టోర్నమెంట్ల నిర్వహణ బాధ్యతను ఈ సంస్థ చేపడుతుంది. ఐసీసీ పరిధిలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కీలకంగా వ్యవహరిస్తుంది. ACC ఆసియా ఖండంలో క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైంది.…
పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.
కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన వివాదానికి దారి తీసింది. దీంతో భారత జాతీయ జెండాను ఆ స్టేడియంలో ప్రదర్శించకపోవడంతో పాక్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దెబ్బకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఇక, దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ స్టేడియంలో ఇండియన్ ఫ్లాగ్ ను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్‌కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.
శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది.
2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.