పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్ ఇద్దరినీ న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ నుండి తొలగించారు.
Also Read:Thammudu: ప్రేమతో చెప్తే అర్థం కాదు.. నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ రివ్యూ
ఇక న్యూజిలాండ్ పర్యటనలో షహీన్ అఫ్రిది పాకిస్తాన్ జట్టులో భాగమయ్యాడు. ఆ సిరీస్ లో పాకిస్థాన్ 1-4 తేడాతో ఓటమి పాలైంది. షహీన్ 10.23 ఎకానమీతో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. చివరి మ్యాచ్‌లో అతన్ని జట్టు నుంచి తొలగించారు. షహీన్ కెప్టెన్‌తో సహకరించలేదని, ఈ నేపథ్యంలో అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. కాగా పాకిస్థాన్ జూలై 20 , 24 మధ్య బంగ్లాదేశ్‌తో మూడు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఫ్లోరిడాకు బయలుదేరాల్సి ఉంటుంది, అక్కడ వెస్టిండీస్‌తో ఐదు T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది.