హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
షేన్ వాట్సన్ కు ఐపీఎల్, ప్రధాన యూఎస్ఏ లీగ్ లో కామెంటేటర్ గా ముందుగానే ఒప్పందాలను కలిగి ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆఫర్ ను అతడు తిరస్కరించినట్లు టాక్. పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా వస్తే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఇస్తామని పీసీబీ ఆఫర్ చేసినట్లు సమాచారం.
పాక్ క్రికెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్ ఆజంకే అప్పజెప్పాలని నఖ్వీ ఆలోచిస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
భారత్లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో సెమీ-ఫైనల్కు చేరుకోవడంలో జట్టు విఫలమైతే బాబర్ అజామ్ కెప్టెన్సీకి ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఒక విచిత్రమైన ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో ఇండియా, ఆస్ట్రేలియ, అఫ్గానిస్తాన్లతో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాక్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు ముందే పాకిస్తాన్ టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది.
తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తప్పనిసరి ఇవ్వాల్సిందే. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు అని పేర్కొన్నాడు.
ఐసీసీ వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో పీసీబీ చైర్మన్కు సంబంధించి ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది. జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంది.