పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతను పరిష్కరించడానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే.. కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు గంటల తర్వాత.. పాకిస్థాన్ సైన్యం మళ్లీ భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.
Operation Sindoor Live Updates: సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో.. భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది.
Terrorists Killed: ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన అబు జిందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా, మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని భారత భద్రతా దళాలు ప్రకటించాయి.
పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ప్రతీకార ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘర్షణ సైనిక చర్యలే కాకుండా వాటర్ వార్, దౌత్యదాడికి దిగుతోంది భారత్. పాక్ పై మళ్లీ వాటర్ వార్ కు దిగింది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ ఆనకట్ట 5 గేట్లను తెరిచారు. దీంతో పాకిస్తాన్ వైపు నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. Also…
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి.
ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భీకర దాడి చేసింది.
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్‌గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
India Pakistan War:పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. నార్వాల్, షార్కోట్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లను భారత్ ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.