అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.…
అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే…
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్‌సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్‌కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి.
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్‌ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. "IOK హ్యాకర్"గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్‌సైట్‌లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో కీలక ఉగ్రవాది, ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్‌కి చెందని హషీం మూసాగా గుర్తించారు. ముసాకు పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నట్లుగా మన నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. 26 మందిని క్రూరంగా చంపిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన మూసా పారా-కమాండో శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లో అతడి ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా ఉపయోగపడిందని భద్రతా వర్గాలు తెలిపాయి. 20 ఏళ్ల మూసా కథువా, సాంబా సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి…
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సిగ్గుచేటు పని చేశాడు. పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర దాడిని ఖండించడానికి బదులుగా, అఫ్రిది భారతదేశాన్ని ఆధారాలు అందించమని కోరాడు. వైరల్ అయిన ఓ…
Vajra Super Shot: ఇటీవల జరిగిన పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం ‘వజ్ర సూపర్ షాట్’ అనే యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియంల వద్ద ప్రవేశపెట్టడమే. ఐపీఎల్ 2025లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియంలలో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. దీనితో క్రికెట్ అభిమానులు ఎలాంటి భయం అవసరం లేకుండా మ్యాచ్‌లను…
ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్‌కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్! ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ…
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన హృదయం చాలా విచారంగా ఉందని.. ప్రతి భారతీయుడు కోపంతో మండిపోతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శించారు. శత్రువులకు దేశ అభివృద్ధి నచ్చడం లేదని..
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని ఫ్రంట్ ఆర్గనైజేషన్ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ఈ దాడి చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెు పాక్ హస్తం ఉందనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.