Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
- పహల్గామ్ ప్రధాన సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
- గతంలో పాక్ ఆర్మీలో పనిచేసిన హషీం మూసా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో కీలక ఉగ్రవాది, ప్రధాన సూత్రధారిగా పాకిస్తాన్‌కి చెందని హషీం మూసాగా గుర్తించారు. ముసాకు పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నట్లుగా మన నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. 26 మందిని క్రూరంగా చంపిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన మూసా పారా-కమాండో శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లో అతడి ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా ఉపయోగపడిందని భద్రతా వర్గాలు తెలిపాయి.
20 ఏళ్ల మూసా కథువా, సాంబా సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఇతను రాజౌరి-పూంచ్‌లోని డేరా కి గలి ప్రాంతంలో యాక్టివ్‌గా మారాడు. ఇతడి లష్కరే తోయిబా మాడ్యుల్ గత ఏడాది నుంచి భద్రతా బలగాలపై దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మూసా గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
Read Also: Pahalgam Terror Attack: ‘‘అల్లాహు అక్బర్’’ నినాదాలు చేయడం సహజం: ఎన్ఐఏ వర్గాలు..
పాకిస్తానీ పారా కమాండోలు, ముఖ్యంగా షల్ సర్వీసెస్ గ్రూప్ (SSG) ద్వారా శిక్షణ పొందిన వారు. వీరు అసాధారణ యుద్ధం, మనుగడ వ్యూహాలు, పర్వత ప్రాంతాల్లో పోరాటంలో ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీరి ట్రైనింగ్‌లో అధిక ఓర్పుతో నిర్వహించే ఆపరేషన్లు, క్లోజ్ క్వార్టర్స్ యుద్ధం, క్లిష్ట భూభాగాల గుండా ప్రయాణాలు, తప్పించుకోవం వంటివి ఉంటాయి. ఇవన్నీ మూసా కార్యకలాపాల్లో ప్రతిబింబిస్తున్నాయి.
మూసా గత కొంత కాలంగా పోలీసులు, సైనిక గస్తీ నుంచి తప్పించుకున్నాడు. కఠినమైన పర్వతాలు, అడవుల గుండా ప్రయాణిస్తున్నాడు. ముఖ్యంగా, ఆహారం కోసం గ్రామాలకు రావడం మానేశారు, గతంలో ఉగ్రవాదులు స్థానికులపై ఆధారపడటంతో త్వరగా భద్రతా బలగాలకు చిక్కేవారు. పహల్గామ్ సమయంలో M4 కార్బైన్‌లతో సహా అధునాతన ఆయుధాలను ఉపయోగించడం కఠినమైన సైనిక శిక్షణను సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!