కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది తమ పనేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ – TRF ప్రకటించింది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ISI హస్తం ఉందనే సమాచారం అందుతోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని “స్థానిక తిరుగుబాటు”గా అభివర్ణించింది. బైసరన్ మేడోస్.. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు.…
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్‌కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదంపూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ఉధంపూర్‌లోని డూడులో జరుగుతోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో…
ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టాలి.. పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టేలా ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి, ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.. ఇది…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ టైమ్ లో పాకిస్థాన్ కు సంబంధించిన చాలా విషయాలపై చర్చ జరుగుతోంది. ఇదే టైమ్ లో సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే అబిర్ గులాల్. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా,…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్…
అమెరికాకు చెందిన కోల్‌కతా టెక్కీ బితాన్ అధికారి(40), భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి భారత్‌కు వచ్చాడు. ఫ్లోరిడాలో టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్ 8న కోల్‌కతాలోని సొంతింటికి వచ్చాడు. సరదాగా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేశాడు. అలా కాశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు.
శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పహిల్గామ్ మృతదేహాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసింది.