ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సిగ్గుచేటు పని చేశాడు. పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర దాడిని ఖండించడానికి బదులుగా, అఫ్రిది భారతదేశాన్ని ఆధారాలు అందించమని కోరాడు. వైరల్ అయిన ఓ వీడియోలో, పాకిస్తాన్‌ను నిందించడానికి బదులుగా అఫ్రిది సిగ్గులేకుండా భారతదేశాన్ని విమర్శించాడు.
Also Read:Miss World : విశ్వ వేదికపై హైదరాబాద్.. క్యూ కట్టిన 140 దేశాల అందగత్తెలు..
పాక్ పై ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఎలాంటి దర్యాప్తు లేకుండా పాకిస్తాన్‌ను తొందరపడి నిందించడం సరికాదని అఫ్రిది అన్నారు. క్రికెట్, క్రీడా దౌత్యంపై నాకు ప్రగాఢ నమ్మకం ఉందని అఫ్రిది అన్నారు. ఈ విషయంలో రాజకీయాలు ఉండకూడదు. మనం పొరుగు దేశాలమైతే ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ సంఘటన జరుగగానే పాకిస్తాన్ ను నిందిస్తున్నారు. కనీసం ఆధారాలతోనైనా రండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read:Pak-India: బోర్డర్‌లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!
అఫ్రిది వ్యాఖ్యలపై భారతీయులు మండిపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఘటన అనంతరం భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా దౌత్య దాడికి పూనుకుంది. అలాగే, అట్టారి సరిహద్దును మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐసిసి ఈవెంట్‌లో పాకిస్తాన్‌తో ఆడకూడదని బిసిసిఐ కూడా పరిశీలిస్తోంది.