పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆ
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.
ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్! ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో…
ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్‌లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు..
పహల్గాంలో జరిగిన దాడికి గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ దాడిలో 26 మంది అమాక టూరిస్టులు మృతి చెందడంతో అందరూ భారత్‌కు సపోర్టుగా నిలిచారు. మన దేశంలోని పౌరులు ఈ దాడిపై రగిలి పోతున్నారు. పాక్‌పై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికైనా శాంతి మంత్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం "WewantreRevenge" ట్యాగ్ వైరల్ అయ్యింది. అయితే ఈ దాడిపై శత్రుదేశం పాకిస్థాన్‌లో ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
రీసెంట్‌గా జమ్ము కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్‌లో ఉగ్రవాదులు కృరంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా 28 మంది అమాయకులు ప్రాణాలు తీశారు. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవ్వడం అందర్ని కలిచి వేసింది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని,ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని…
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.
బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా.. బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్,…
ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని…