Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిస్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్న గౌరవ్ గొగోయ్‌పై ఆరోపణలు చేశారు. గోగోయ్ పాకిస్తాన్‌లో 15 రోజులు గడిపారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన పరోక్షంగా పాక్ సైన్యానికి సహాయం చేసి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే, గౌరవ్ గొగోయ్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. పాకిస్తాన్ పర్యటన గురించి సీఎం చేస్తున్న వ్యాఖ్యల్ని…
India Pakistan: పాకిస్తాన్‌కి మరో బిగ్ షాక్ ఇచ్చింది భారత్. 24 గంటల పాటు చీనాబ్ నది నీటిని దిగ్బంధించిన భారత్ ఇప్పుడు ఆ నీటిని ఒక్కసారిగా వదిలినట్లు సమాచారం.
India Pakistan Tension: పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది, కానీ భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఊహించలేకపోయింది. పాకిస్తాన్ ఎన్ని ఉగ్రవాద దాడులకు చేయించినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా ‘‘సింధు జలాల ఒప్పందం’’ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ, ఈసారి మాత్రం భారత్ పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే దెబ్బతీసింది. ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని నిలపుదల చేసింది. ఇప్పటికే, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కి చెందిన ఉగ్రవాదులు చంపారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేతికి అందాయి. అయితే, భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ తన నైజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాల ముందు చేయని ప్రయత్నం లేదు. పాకిస్తాన్‌కి ప్రస్తుతం సాయం చేసే మిత్రులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో మిత్రుల…
MP Imran Masood: 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్, పాకిస్తా్న్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడుతుందా?? గతంలో మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్స్ లేదా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందా.? అని యావత్ దేశం చూస్తోంది. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి సంఘర్షణ వచ్చే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్‌పై దౌత్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్‌కి కీలకమైన ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’…
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆందోళన చెందిన పాకిస్తాన్ UNSC తో సమావేశం కావాలని అభ్యర్థించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఒంటరి అయింది. ఈ సమావేశాన్ని పాకిస్తాన్ మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఉపయోగించుకుంది. సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు పాకిస్తాన్…
Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్…
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. 700…
Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్లో పెద్ద ఊచకోత జరిగింది.