ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ధాన్యం కొనమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఎ కేసీఆర్ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
Kకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన రాష్ట్రంలో రైస్ మిల్లులను సీజ్ చేయాలని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఇవేమీ మాటలు… బియ్యం కొనమంటే కొనరు.. వడ్లు కొనమని మొండి కేస్తారు.. మన రైతులను నూకలు తినమని అవమానిస్తూ మాట్లాడుతారు అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతులు ఏమి చేయాలి.? అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని, 4 వేల కోట్ల నష్టం వస్తున్నా, కేసీఆర్ వాటిని భరిస్తూ, కొనుగోలు చేస్తున్నారన్నారు. కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర చేసిందని, ఎవరైనా వచ్చి రెచ్చ గొడితే రెచ్చి పోవద్దు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.