వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్బీకే వ్యవస్థ కొత్తగా రావడంతో ప్యాడీ ప్రొక్యుర్‌మెంట్‌లో గ్యాప్ వచ్చిందన్నారు.. రైతులకు ఈక్రాప్ విశయంలో అవగాహనా లోపం ఓ కారణమన్న ఆయన.. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సమస్య రావడానికి కొత్త వ్యవస్థే కారణం అన్నారు.. అయితే, రాబోయే ఏడాది ఎలాంటి సమస్య ఉండదని భరోసా ఇచ్చారు.. దేశంలో వ్యవసాయం సంక్లిష్డంగా ఉందని.. వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
Read Also: Petrol at Rs 1 per litre: అక్కడ రూపాయికే లీటర్ పెట్రోల్.. మరి ఊరుకుంటారా..?
ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా చేసి రైతులకు సమాచారం అందిస్తున్నామన్నారు మంత్రి ధర్మాన.. ఆధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు రైతులు పాటించాలని కోరారు… వంశధార ప్రొజెక్ట్ ద్వారా 19 టీఎంసీని నింపడానికి కృషిచేస్తున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. వచ్చే రబీకి రెండు లక్షల ఎకరాలు నీరు అందిస్తాం, ఇతర రాష్ర్టాల రైతుల కంటే ఏపీలో మెరుగైన ఫలితాలు అందిస్తామని ప్రకటించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.