యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా క్వింటల్ ధాన్యానికి ధర రూ.1960గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతు మీద ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ ధాన్యం సేకరణ చేస్తున్నారని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం నూక శాతం నష్ట భారం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని రైతులకు భరోసా కల్పించారు.
వరి వేయండని రెచ్చగొట్టి, పక్కకు తప్పుకున్న బీజేపీ నాయకుల మాటలు రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. ఏ సందర్భంలోనైనా తెలంగాణకు కేసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. క్వింటాల్‌కు రూ.1960 తీసుకొని లాభంతో సంతోషంగా వెళ్ళాలని కాంక్షిస్తున్నానన్నారు.
మంచి ధాన్యంలో కిలో తరుగు తీసిన రైస్ మిల్లులు సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు.
Madhu Yaskhi Goud : పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగింది