వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్ కుమార్ వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం ఇవాళ ఢిల్లీ కి వెళ్లింది. వానా కాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనపు ధాన్యం కొనుగోలుపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఢిల్లీకి వెళ్లారు మంత్రులు. ఇక రేపు, ఎల్లుండి కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి తో భేటీకి ప్రయత్నిస్తున్నారు. అయితే.. కేంద్రం పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.