CM KCR : తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలి.. మోడీకి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరోసారి ధాన్యం కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చింది. యాసంగిలో పండించిన ధాన్యం చివరి గింజ వరకు కేంద్రం కోనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే గులాబి దళం మంత్రులు హస్తినకు చేరుకొని కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. అంతేకాకుండా పంజాబ్, హర్యానాలో మాదిరిగానే తెలంగాణలోనూ ధాన్యాన్ని సేకరించాలని కేసీఆర్ కోరారు. దేశంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అని లేఖలో ఆయన గుర్తు చేశారు.
రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే.. కనీస మద్దతు ధరకు అర్థం ఏముంటుందని సీఎం కేసీఆర్ తన లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలా చేయడం ఆహార భద్రతా లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్టే అవుతుందని, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధాన్య సేకరణ విధానం ఉండాలని లేఖలో ప్రస్తావించారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాల సేకరణ, వాటి బాధ్యత కూడా కేంద్రానిదే అని, దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!