తెలంగాణలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. యాసంగిలో వరి సాగు తగ్గింది. కేసీఆర్ మాటలకు ఎవ్వరూ కూడా వరి సాగు చేయలేదు. కేంద్రం ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రా రైస్ కొంటాం కానీ, బోయిల్డ్ రైస్ కొనమని చెప్తోంది. గత వానాకాలంలో మీరు చేసిన పని వల్ల రైతులు నష్టపోయారు..
గతంలో ప్రభుత్వం ధాన్యం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కూడా చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ నిద్రపోదు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన వరి సాగే కనిపిస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మళ్ళీ కొనసాగించాలి. ధాన్యం కొనటం ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే మాకు 10 వేల కోట్లు ఇవ్వండి. మేము కొని కేంద్రానికి పంపుతాం అన్నారు చిన్నారెడ్డి. మాకు రైతుల పట్ల విశ్వాసం ఉంది మీకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.